

ది.27-05-2012 ఆదివారం C.R. కాలనీ పార్క్ లో కాలనీ వాసుల ప్రధమ సమావేశము జరిగినది. శ్రీ మానం శ్రీనివాసరావు గారు తొలి పరిచయ వాక్యాలతో ఈ కార్యక్రమము ప్రారంభమైనది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధి గా పట్టణ మునిసిపల్ కమిషనర్ శ్రీ మన్నే ఏసుదాసు గారు విచ్చేసారు. కాలనీ వాసులందరూ కాలనీ లోని పార్క్ అభిలను గురించి, కాలువల గురించి, రోడ్ల గురించి కమీషనర్ గారికి మనవి చేసారు. కమీషనర్ గారు పార్క్ అభివృద్ధి కొరకు, ముఖ్యం గా వాకింగ్ ట్రాక్ వేయించుటకు, వర్షా కాలంలో మొక్కలు నాటించుటకు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ చేసే పనులే కాకుండా కాలనీ వాసులు కూడా పార్క్ అభివృద్ధికి donations రూపంలో సహాయం చేయాలనీ, అప్పుడే పార్క్ ఉపయోగపడగలదని అన్నారు. పార్క్ డెవలెప్ మెంట్ కొరకు కాలనీ వాసులందరూ ఒక అసోసియేషన్ గా ఏర్పడాలని సూచించారు.



అందరు కలిసి పార్క్ లోపల మెరక తోలించటం అవసరమని భావించారు. మొదటిగా శ్రీ లంకా ఆదినారాయణ రెడ్డి గారు వారి సోదరులు కలిపి లక్ష రూపాయలు విరాళం ప్రకటించటంతో డొనేషన్స్ పరంపర సందడిగా మొదలైనది. అందరు పార్క్ అభివృద్ది పనులను దృష్టిలో ఉంచుకొని రు.5000 లకు తగ్గకుండా తమ తమ విరాళాలు ప్రకటించారు.







ఈ సమావేశములో శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, శ్రీ కోటిరెడ్డి గారు (రోటరీ ప్రెసిడెంట్), శ్రీ నాగిరెడ్డి గారు( C.R. colloge rtd. ప్రిన్సిపాల్) మరి కొందరు పెద్దలు తమ అభిప్రాయాలూ కాలనీ వాసులతో పంచుకున్నారు. అప్పటికప్పుడు సుమారు 3 లక్షలకు పైగా విరాళాలను కాలనీ వాసులు ప్రకటించటం సంతోషకరం. విరాళములను పార్క్ కొరకు వినియోగించుటకు గాను ఒక కమిటి ఏర్పాటు చేయబడినది. శ్రీ ఆదిరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, నాగిరెడ్డి గారు, వీరా రెడ్డి గారు, సురేష్ గారు, శ్రీనివాసరావు గారు మొదలైనవారు కమిటిలో సభ్యులుగా ఉన్నారు.


కమిషనర్ గారు కాలనీ వాసుల చైతన్యానికి స్పూర్తి పొంది, వచ్చే ఆదివారం నాడు మరో సమావేశం ఏర్పాటు చేయాలనీ, ఆ సమావేశములో SSC, మరియు ఇంటర్ లో కాలనీ లో ఫస్ట్, సెకండ్ వచ్చిన విద్యార్ధులకు తన కుమార్తె జ్ఞాపకార్ధం ప్రోత్సాహకాలు అందించగలనని ప్రకటించారు.